కాంగ్రెస్ నేతలకు సోనియాగాంధీ దిశానిర్దేశం

కాంగ్రెస్ నేతలకు సోనియాగాంధీ దిశానిర్దేశం

అభ్యర్థుల ఎంపిక మొదలు, అసంతృప్త నేతను బుజ్జగించడంలో నేతలంతా సమయస్పూర్తితో వ్యవహరించాలని ఇదే మున్ముందు కొనసాగించాలని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాష్ట్ర పార్టీ పెద్దలకు సూచించారు. రాత్రి ఢిల్లీకి తిరుగు పయనమయ్యే సందర్భంగా ఆమె ఎయిర్ పోర్టు లాంజ్ లో కొద్దిసేపు పార్టీ పెద్దలతో మాట్లాడారు. ప్రచారానికి తక్కువ రోజులు మాత్రమే ఉన్నందున మరింత ఉదృతంగా ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబపాలన, ఇచ్చిన వాగ్ధానాల అమలులో చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగుల విషయంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.