'మోసం, బెదిరింపులే మోడీ విధానం..'

'మోసం, బెదిరింపులే మోడీ విధానం..'

ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మోసం, బెదిరింపులతో పాలన కొనసాగించడమే నరేంద్ర మోడీ సర్కార్ విధానం అంటూ మండిపడ్డారు. దేశంలో పరిపాలన, సామాజిక సామరస్యం, ఉద్యోగాల కల్పనల పరిస్థితులను ప్రసావించిన సోనియా గాంధీ.. గత ఎన్నికల సమయంలో ప్రజలు ఆశించిన ఫలితాలను నెరవేర్చకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దేశంలోని వ్యవస్థలను బలహీనపర్చేప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించిన సోనియా.. పార్లమెంటును కూడా బలహీన పర్చారు. సరైన రీతిలో చర్చ జరగడంలేదని ఆరోపించారు. సభ్యులు తమ వాదనలను వినిపించే వీలు లేకుండా చేశారన్న ఆమె.. నిజాలను, పారదర్శకతను పక్కనపెట్టేశారు. మన ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర్య విధానాలపై క్రమపద్ధతిలో దాడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రసంశలు కురిపించారు సోనియాగాంధీ. తాజాగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మనం సాధించిన విజయం మనలో నమ్మకాన్ని మరింత నింపిందన్నారు. కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీలు గతంలో చాలా శక్తిమంతంగా ఉన్నట్టు కనపడ్డాయి. కానీ, మన పార్టీ అధ్యక్షుడు వారితో నేరుగా పోరాటం చేశాడు.. లక్షలాది మంది కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యకర్తలంతా రాహుల్‌కు మద్దతుగా నిలిచారని తెలిపారు.