సోనియా గాంధీ దగ్గర ఉన్న నగదు రూ.60,000 మాత్రమే!

సోనియా గాంధీ దగ్గర ఉన్న నగదు రూ.60,000 మాత్రమే!

యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ గురువారం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గానికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె దగ్గర రూ.60,000 మాత్రమే నగదు ఉంది. రూ.16.59 లక్షల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఆమె మొత్తం రూ.2,44,96,405ని షేర్లలో పెట్టుబడులు పెట్టారు. వీటిలో రిలయన్స్ హైబ్రిడ్ బాండ్ జి, రూ.28,533 విలువైన ట్యాక్స్-ఫ్రీ బాండ్లు ఉన్నాయి. అంతే కాకుండా రూ.72,25,414 విలువైన పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) రూపంలో పెట్టుబడులు ఉన్నట్టు తెలిపారు. 

సోనియా గాంధీకి న్యూఢిల్లీలోని డేరామండీ గ్రామంలో రూ.7,29,61,793 విలువైన వ్యవసాయ భూమి ఉంది. ఇటలీలో వారసత్వంగా వచ్చే ఆస్తిలో రూ.7,52,81,903 వాటా ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. కుమారుడు రాహుల్ గాంధీ నుంచి రూ.5 లక్షలు చేబదులుగా తీసుకున్నట్టు అఫిడవిట్ లో చూపారు. సోనియా గాంధీ దగ్గర 88 కిలోల వెండితో సహా రూ.59,97,211 విలువైన ఆభరణాలు ఉన్నాయి.