మరో మిషన్ కు సిద్ధమైన సోనూ సూద్‌...

మరో మిషన్ కు సిద్ధమైన సోనూ సూద్‌...

రీల్ హీరో నుండి రియల్ హీరో గా మారిన సోనూసూద్ మరో మంచి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు సినిమాలో విలన్ గా మాత్రమే అందరికి పరిచయమున్న సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో తాను చేసిన పనులతో హీరో గా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అలాగే విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఆయన ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో మిషన్ కు సిద్ధమయ్యాడు సోనూ సూద్. అదేంటంటే... అమెరికాకు చెందిన ఓ వైద్య విద్యార్థి సోనూ సూద్‌కు ట్వీట్‌ చేస్తూ.. ‘సోనూ సూద్‌ సార్‌... దాదాపు మేము 100 మంది వైద్య విద్యార్థులం దక్షిణ అమెరికాలోని గయానాలో చిక్కుకుపోయాం. మేమంతా ఇప్పుడు తిరిగి మా ఇళ్లకు రావాలనుకుంటున్నాం... మాకు సహాయం చేయండి’ అంటూ ట్వీట్‌ చేసారు . ఈ ట్వీట్‌ కు స్పందించిన ఈ రియల్ హీరో... ‘కొత్త దేశం.. కొత్త మిషన్‌.. తప్పకుండ మీకు సహాయం అందిస్తా.. అప్పటి వరకు మీకు టచ్ లోనే ఉంటాను’ అని సమాధానం ఇచ్చారు.