నీకోసమే ఎదురు చూస్తున్నా: సోనూసూద్

నీకోసమే ఎదురు చూస్తున్నా: సోనూసూద్

ముంబై: సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే అతడికి అనేక మంది తారలు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ఇప్పుడు సోనూసూద్ కూడా చేరాడు. అయితే సోనూసూద్, సంజయ్‌లు ఇద్దరు పృథ్వరాజ్ సినిమాకు పనిచేస్తున్నారు. సంజయ్ రికవరీపై సోనూ ఓ ట్వీట్ చేశాడు. ‘నీన్ను కలిసేందుకు పృథ్విరాజ్ సెట్స్‌లో ఎదురు చూస్తున్న’ అంటూ తన ట్వీట్‌లో రాశాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రథాన పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా సంజయ్ మరో ప్రముఖ పాత్రను చేయనున్నాడు. అయితే క్యాన్సర్‌పై తన విజయాన్ని చెబుతూ సంజయ్ ఇలా అన్నాడు. ‘దేవుడు తన బలమైన యోధులచేత కష్టమైన యుద్దాలు చేయిస్తాడ’ని సంజయ్ అన్నాడు. తాను క్యాన్సర్‌తో పారాడుతున్న సమయంలో తనకు అందగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు.