సోనీ కంపెనీలో ఇదే ఖరీదైన ఫోన్..!!

సోనీ కంపెనీలో ఇదే ఖరీదైన ఫోన్..!!

స్మార్ట్ యుగంలో రోజుకో స్మార్ట్ ఫోన్ విపణిలోకి విడుదలౌతుంది.  రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని మొబైల్ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నారు.  సోనీ కంపెనీ కూడా ఇతర మొబైల్ కంపెనీలతో పోటీ పడుతూ.. కొత్త కొత్త మొబైల్ ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నది.  తాజాగా, ఈ కంపెనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్ 2 మొబైల్ విపణిలోకి విడుదల చేయబోతున్నది.  దీని ధర రూ.72,990/- .  సోనీ కంపెనీ నుంచి వస్తున్న ఖరీదైన ఫోన్ ఇదే కావడం విశేషం.  ఇందులో వినియోగదారులకు అవసరమయ్యే అన్ని ఫీచర్స్ తో పాటు సరికొత్త ఫీచర్స్ ను కూడా వినియోగించింది.  ఆగష్టు 1 వ తేదీ నుంచి ఈ మొబైల్ అన్ని స్టోర్స్ లో లభ్యమౌతుంది.  

మొబైల్ ఫీచర్స్ : 

5.7 ఇంచెస్ ఫుల్ హెచ్.డి స్క్రీన్ 

1080X2160 రెసొల్యూషన్ 

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ 

ఆండ్రాయిడ్ ఒరియా ఆపరేటింగ్ సిస్టం 

6జీబీ ర్యామ్ 

64 జీబీ ఇంటర్నల్ మెమరీ 

400 జీబీ ఎస్డీ కార్డు మెమరీ 

19 ఎంపీ కెమెరా 

3180 ఎంఏహెచ్ బ్యాటరీ