ధోని పై దాదా... 

ధోని పై దాదా... 

ఎంఎస్ ధోనికి నేను పెద్ద అభిమానిని అని ఈ లెజండరీ వికెట్ కీపర్-బ్యాట్స్మాన్ గురించి మాట్లాడాడు భారత మాజీ కెప్టెన్  సౌరవ్ గంగూలీ. ఇక 2004 బంగ్లాదేశ్‌లో జరిగే సిరీస్ కోసం ధోనిని వన్డే జట్టులో ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్టర్లకు తానే చెప్పినట్లు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నారు. నిజం, సాధ్యమైనంత ఉత్తమమైన జట్టును ఎంచుకోవడం కెప్టెన్ పని అందుకే నేను అతడిని జట్టులోకి తీసుకున్నాను . భారత క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే అతను అన్నివిధాలుగా నమ్మదగనివాడు. ఇక నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతను 3 వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు అని గంగూలీ మయాంక్ అగర్వాల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ధోని 39 వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బీసీసీఐ కూడా గంగూలీ మాటలనే పోస్ట్ చేసింది. అయితే ధోని ప్రపంచ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్ళలో ఒకడు అనేది నిజం.