కోహ్లీని చూసి నేర్చుకో...

కోహ్లీని చూసి నేర్చుకో...

భారత మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కు ఓ సలహా ఇచ్చారు. టీ20 సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. క్రీజులో రిషబ్‌ ఉన్నంత వరకు భారత్ విజయంపై ధీమాగా ఉంది. అయితే చివర్లో ఒత్తిడి కారణంగా అతను అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఆసీస్ గెలిచింది. ఇదే విషయమై తాజాగా గంగూలీ మాట్లాడుతూ... రిషబ్‌కు ఎంతో ప్రతిభ  ఉంది. అతను ఫ్యూచర్ క్రికెటర్. అతను సులభంగా పరుగులు రాబట్టగలడు. కానీ ఆటను సులభంగా ఆడే విషయంలో మాత్రం రిషబ్‌ ఇంకా మెరుగుపడాలి. ఈ విషయంలో కెప్టెన్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. అతను తొందరగానే  నేర్చుకుంటాడనుకుంటున్నా అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మూడు టీ20లు ఆడడం సరైంది కాదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇది మరీ కష్టమైన షెడ్యూల్‌ అని గంగూలీ పేర్కొన్నారు. మూడో టీ20 సిడ్నీలో ఉంది. తొలి రెండు పిచ్‌లతో పోల్చుకుంటే.. సిడ్నీ పిచ్‌ నుంచి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిడి ఉన్నా కూడా చివరి టీ20లో భారత్ విజయం సాధిస్తుంది. చివరి టీ20లోనే కాదు టెస్టు, వన్డే సిరీస్‌లనూ భారత్‌ గెలుస్తుందని గంగూలీ చెప్పుకొచ్చారు.