రోహిత్‌ను ఎంపికచేయకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యా

రోహిత్‌ను ఎంపికచేయకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యా

వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపికచేయకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యా అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ అన్నారు. వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు ఎమ్మెస్కే ప్రసాద్‌  నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టును శనివారం ప్రకటించింది. అయితే ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మకు టెస్టుల్లో స్థానం దక్కకపోవడంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాజాగా గంగూలీ ట్వీట్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ' రోహిత్‌ మరియు జట్టు సభ్యులు అందరు ఆసియా కప్ లో అద్భుత విజయం సాధించారు. వెస్టిండీస్‌ టూర్ కు జట్టులో నీ పేరు లేకపోవడం నేను ఆశ్చర్యానికి గురయ్యా. టెస్టుల్లో నీ రి ఎంట్రీకి ఇంకా ఎంతో సమయం పట్టదు' అంటూ గంగూలీ ట్వీట్‌ చేశాడు.