వరల్డ్‌కప్‌లో ఈ 4 జట్లే ఫేవరెట్ల: గంగూలీ

వరల్డ్‌కప్‌లో ఈ 4 జట్లే ఫేవరెట్ల: గంగూలీ

వచ్చే నెలలో ప్రారంభమయ్యే క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఫేవరెట్లను టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీలో పోటీ తీవ్రంగా ఉంటుందన్న గంగూలీ.. భారత జట్టు చాలా బలంగా ఉందన్నాడు. టీమిండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్ జట్టు కచ్చితంగా సెమీస్‌కు చేరుకుంటాయని.. ఇందులో ఓ జట్టు కప్పును ఎగరేసుకుపోతుందని తెలిపాడు.  ఈసారి టోర్నీలో ప్రతి మ్యాచూ పోటాపోటీగా జరిగే అవకాశాలున్నాయని గంగూలీ చెప్పాడు. 2013లో గంగూలీ నేతృత్వంలో టీమిండియా ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరుకుంది.