దాదా చేతిలో మిస్టర్ కూల్ భవితవ్యం..! తాజా కామెంట్స్..!

దాదా చేతిలో మిస్టర్ కూల్ భవితవ్యం..! తాజా కామెంట్స్..!

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ భవితవ్యం ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కు, ఏ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో లేడు.. మిస్టర్ కూల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేశారు అనే చర్చ సాగుతోంది. అయితే, దీనిపై ధోనీ ఎక్కడా స్పందించన సందర్భాలు లేవు.. ఇక మిస్టర్ కూల్ భవితవ్యం తేల్చడం ఇప్పుడు మాజీ కెప్టెన్, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా కోర్టులోకి వెళ్లింది.. ఈనెల 23న బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతన్న దాదా.. ఈ నెల 24న సెలక్టర్లతో సమావేశం కానునున్నారు. ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడనున్నట్టు గంగూలీ వెల్లడించారు. అయితే, ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక, కొన్ని నిబంధనల్లో మార్పులతో హెడ్‌ కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చారు దాదా. మొత్తానికి మిస్టర్ కూల్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.