రవిశాస్త్రితో విభేదాలు...! దాదా ఏ మన్నారంటే...

రవిశాస్త్రితో విభేదాలు...! దాదా ఏ మన్నారంటే...

దాదా అలియాస్ గంగూలీ.. రవిశాస్త్రికి పొసగదని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అసలు టీమిండియా చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉండడం కూడా గంగూలీకి ఇష్టం లేదనే ప్రచారం అప్పట్లో హాట్‌హాట్‌గా సాగింది. అయితే, రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తాననడంలో అర్థంలేదని మరోసారి స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. గతంలో ఓ సారి కోచ్‌ విషయంలో దాదా మరోసారి స్పందించారు. గత విభేదాలను తాను పట్టించుకోనని, అప్పటి విషయాలను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రిపై కక్ష సాధిస్తాననడంలో అర్థంలేదని అన్నారు. రవిశాస్త్రిని లక్ష్యంగా చేసుకుంటానని వస్తున్న కథనాలు నిజం కాదని, అందుకే వాటిని పుకార్లు అంటారన్నారు. అలాంటి ఊహాగానాలకు తన వద్ద జవాబులు ఉండవని, ఎవరైనా పనితీరు బాగుంటేనే పదవిలో కొనసాగుతారని, తాము కోరుకునేది ఫలితాలనే అని స్పష్టం చేశారు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ జోడీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని చెప్పారు దాదా.