ఆసీస్ లో బలమైన బయో బబుల్ కావాలి : గంగూలీ

ఆసీస్ లో బలమైన బయో బబుల్ కావాలి : గంగూలీ

ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఈ పర్యటనలో 3 వన్డే, 3 టీ20, 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ ఆడుతుంది. అందువల్ల యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ లో పాల్గొన్న భారత జట్టు సభ్యులు వచ్చే నెలలో సిడ్నీకి వెళ్లి అక్కడ 14 రోజులు నిర్బంధం లో ఉండాల్సి ఉంది. అయితే భారత జట్టు ఆస్ట్రేలియాలో నిర్బంధంలో ఉన్నప్పుడు అక్కడి ప్రోటోకాల్‌లను అనుసరిస్తుందని గంగూలీ వెల్లడించారు. కానీ ప్రస్తుతం అక్కడికి వెలికిన తర్వాత ఆటగాళ్లు ఉండే బయో బబుల్ ను బలోపేతం చేయడం పై క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నాము అని తెలిపారు. అక్కడ కరోనా కేసులు అంతగా లేవు అయిన ఇది సుదీర్ఘ పర్యటన కాబట్టి ఆటగాళ్లు చాలా రోజులు బబుల్ లో ఉండాల్సి ఉంటుంది అని దాదా పేర్కొన్నారు. అయితే ఈ పర్యటనలో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతిచెందుకే ప్రయత్నిస్తున్నాము అని అన్నారు.