ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానుల అనుమతి పై గంగూలీ...
ఐపీఎల్ 2021 మ్యాచ్ లకు అభిమానులను అనుమతించాలా వద్దా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. అయితే, ఏప్రిల్ 9 న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ అభిమానులు లేకుండా ప్రారంభమవుతుందని స్పష్టం చేసిన దాదా, స్టేడియంలోకి ఫ్యాన్స్ ను అనుమతించాలా వద్దా అనే పిలుపు తరువాత తీసుకుంటామని చెప్పారు. అయితే లాజిస్టిక్స్ సమస్య వల్లే ఐపీఎల్ లీగ్ మ్యాచులకు అభిమానులు అనుమతించడం లేదన్నారు గంగూలీ. లీగులకు అభిమానుల్ని అనుమతిస్తే... వాళ్లు ఆటగాళ్లను సమీపించే అవకాశం ఉందన్నారు. అది కాస్త రిస్క్‌తో కూడుకున్న విషయమన్నారు. పరిస్థితులను బట్టి ప్లే ఆఫ్లకు అభిమానుల్ని అనుమతిస్తామన్నారు గంగూలీ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)