నాకు ఐసీసీ చైర్మన్ కావాలని తొందర లేదు : దాదా 

నాకు ఐసీసీ చైర్మన్ కావాలని తొందర లేదు : దాదా 

ఐసీసీ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్ తన పదవివికి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పటి నుండి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదుపరి ఐసీసీ అధ్యక్షుడిగా కాబోతున్నారు అని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే డేవిడ్ గోవర్ మరియు గ్రేమ్ స్మిత్ వంటి మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు అలాగే దాదా ఐసీసీ చైర్మన్ కావడానికి తమ మద్దతును ప్రకటించారు. అప్పటి నుండి ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఆ తర్వాత గంగూలీకి  పోటీదారుడిగా ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇసిబి) మాజీ ఛైర్మన్ కోలిన్ గ్రేవ్స్‌ వచ్చాడు.  ఈ విషయం పై స్పందించిన  గంగూలీ మాట్లాడుతూ.. ఐసీసీ ఛైర్మన్‌గా తన భవిష్యత్తు పూర్తిగా బీసీసీఐ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎందుకంటే బీసీసీఐ లో 2 పోస్టులను నిర్వహించడానికి అనుమతి లేదు. ఎసీసీ లేదా ఐసీసీ లో పదవి చెప్పటలంటే బీసీసీఐ లో ఏ రకమైన పదవిలో ఉండకూడదు అని గంగూలీ చెప్పారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ సమయాల్లో బీసీసీఐ ని విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం కాదు అని తనకు తెలుసు అంటూ మాజీ భారత కెప్టెన్ తెలిపారు. నేను చిన్నవాడిని కాబట్టి ఐసీసీ ప్రెసిడెంట్ కావడానికి నాకు తొందర లేదు అని అన్నాడు. అయితే దాదాకు ఇటీవలే 48 ఏళ్లు నిండాయి.