అది ఆడటం అంటే చాల ఇష్టం అంటున్న దాదా ... 

అది ఆడటం అంటే చాల ఇష్టం అంటున్న దాదా ... 

భారత టెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మాన్ మయాంక్ అగర్వాల్ బీసీసీసీ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన వీడియోలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... నాకు టీ 20 క్రికెట్ ఆడటం చాలా ఇష్టం అని తెలిపాడు. ఈ పొట్టి ఫార్మాట్‌లో కొన్నిపెద్ద షాట్లు కొట్టడానికి తన ఆటను కూడా మార్చుకున్నానని ఈ ఎడమచేతి వాటం బాట్స్మెన్ చెప్పాడు. ఐపీఎల్ యొక్క మొదటి ఐదేళ్ళు నేను ఆడాను, కాబట్టి నాకు స్వింగ్ చేయడానికి మరియు కొట్టడానికి లైసెన్స్ వచ్చింది, అందువల్ల నేను టీ 20 క్రికెట్‌ను ఆస్వాదించానని అనుకుంటున్నాను" అని గంగూలీ చెప్పారు.అయితే తన ఐపీఎల్ కెరీర్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన దాదా 25.4 సగటుతో 1,349 పరుగులు చేశాడు. టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత 2011 మరియు 2012 ఎడిషన్లలో పూణే వారియర్స్ ఇండియా తరపున ఆడాడు.