దాదా కీలక నిర్ణయం..!

దాదా కీలక నిర్ణయం..!

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలి అలియాస్ దాదా కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ) సభ్యుడిగా ఉంటూనే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా పనిచేస్తున్నాడు దాదా. అయితే, విరుద్ధ ప్రయోజనాల అంశంతో దాదాపై ఓ ఫిర్యాదు అందింది. ఈ విషయంలో ఇప్పటికే దాదాకు నోటీసులు జారీ చేసిన అంబుడ్స్‌మన్‌.. తన ముందు నేరుగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గంగూలి ఒక  పదవి వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ముందు హాజరుకానున్న దాదా.. రెండింట్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితుల్లో సీఏసీని దూరం కానున్నట్లు సమాచారం. అయితే, గంగూలితో పాటు సచిన్‌ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా సీఏసీలో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ముంబై జట్టుకు సచిన్‌, హైదరాబాద్‌ జట్టుకు లక్ష్మణ్‌ సలహాదారులుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి విషయంలో సీఏసీకి చివరిసారిగా హాజరయ్యారు దాదా.. ఆ తర్వాత సీఏసీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. దీంతో దాదాపై సీఏసీ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.