టీమిండియా బౌలర్ల జోరు.. సఫారీల బేజారు..

టీమిండియా బౌలర్ల జోరు.. సఫారీల బేజారు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో నాలుగో రోజు కూడా టీమిండియా అదరగొడుతోంది. తొలి  ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైన సఫారీ జట్టు ఫాలోఆన్‌ ఆడుతుండగా.. ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట ప్రారంభమైన తర్వాత రెండో బంతికే ఇషాంత్‌ శర్మ ఓపెనర్‌ మార్‌క్రమ్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని శుభారంభం చేశాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన బ్రూన్‌ని ఉమేష్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఔట్ చేశాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన అశ్విన్‌ ఎల్గర్, డూప్లసిస్‌ను  పెవీలియన్‌కు పంపడంతో.. దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 74 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత కూడా సఫారీల ఆటతీరులో మార్పురాలేదు.. వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు.. ప్రస్తుతానికి సౌతాఫ్రికా 59 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులతో నిలిచింది. భారత బౌలర్లు మరో 3 వికెట్లు తీస్తే టీమిండియా విజయం లాంఛనమే. మూడు వికెట్లు తీస్తే.. ఇన్నింగ్స్ తేడాతో విక్టరీ కొట్టి చరిత్ర సృష్టించనుంది టీమిండియా.