రాంచీ టెస్ట్...162 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

రాంచీ టెస్ట్...162 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

రాంచీలో భారత్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా జట్టు 56.2 ఓవర్లకు 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిన్న ఆట ముగిసే సమయానికి 9 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు ఈరోజు ఆట ప్రారంభించిన అనంతరం 162 పరుగుల్లో ఆలౌట్ అయ్యింది. భారత్ మొదటి ఇన్నింగ్ 497/9 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ జట్టు 335 పరుగుల ఆధిక్యంలో ఉన్నట్టుంది. ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీయగా షమీ, నదీమ్‌, జడేజా రెండేసి వికెట్లు తీశారు.