బోణీ కొట్టిన సౌతాఫ్రికా..

బోణీ కొట్టిన సౌతాఫ్రికా..

హమ్మయ్య..! ఈ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. ఆఫ్గానిస్థాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘానిస్థాన్‌ 34.1 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. రషీద్‌ ఖాన్‌ (25 బంతుల్లో 6 ఫోర్లతో 35) టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.  స్పిన్నర్‌ తాహిర్‌ 4/29 వికెట్లు పడగొట్టాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో సవరించిన 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 28.4 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. డికాక్‌(68) హషీమ్‌ ఆమ్లా(41 నాటౌట్‌) రాణించారు.