ఫాలోఆన్‌లో అదేతీరు.. కష్టాల్లో సఫారీలు..

ఫాలోఆన్‌లో అదేతీరు.. కష్టాల్లో సఫారీలు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు కూడా టీమిండియా అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైన సఫారీ జట్టు ఫాలోఆన్‌ ఆడుతుండగా.. రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట ప్రారంభమైన తర్వాత రెండో బంతికే ఇషాంత్‌ శర్మ ఓపెనర్‌ మార్‌క్రమ్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని శుభారంభం చేశాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన బ్రూన్‌ని ఉమేష్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఔట్ చేశాడు.. దీంతో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. ఇక, 15 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. కాగా, తొలిఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదడంతో 601/5తో డిక్లేర్ చేసింది భారత్... ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు 275 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 326 పరుగుల ఆధిక్యం భారత్‌కి లభించింది. ఈరోజు మ్యాచ్‌ను ముగించాలన్న పట్టుదలతో ఉంది భారత్.