వరల్డ్ కప్ః దూకుడుగా ఆడుతున్న బంగ్లాదేశ్

వరల్డ్ కప్ః దూకుడుగా ఆడుతున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో భాగంగా ది ఓవల్ లో దక్షిణాప్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ దూకుడుగా ఆడుతుంది. 27 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ తమిమ్ ఇక్బాల్(16; 29 బంతుల్లో, 2 ఫోర్లు) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. సౌమ్య సర్కార్ (42; 30 బంతుల్లో 9 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రిజ్ లో షకీబ్ అల్ హసన్ (52), ముష్ఫీకర్ రహీమ్ (48) ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ బంగ్లాతో మ్యాచ్‌లోనూ దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజాయన్ని చూసిన సఫారీ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.