భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్

భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో భాగంగా ది ఓవల్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఓపెనర్ తమిమ్ ఇక్బాల్(16; 29 బంతుల్లో, 2 ఫోర్లు) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. సౌమ్య సర్కార్ (42; 30 బంతుల్లో, 9 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన షకీబ్ అల్ హసన్ (75; 84 బంతుల్లో 9 ఫోర్లు), ముష్ఫీకర్ రహీమ్ (78; 80 బంతుల్లో 8 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. మహ్మద్ మితున్ (21; 21 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), మోసద్దీక్ హోస్సెన్ (26; 20 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. చివర్లో మహ్మదుల్లా (46; 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేయడంతో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలింగ్ లో ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్, ఆండిల్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ బంగ్లాతో మ్యాచ్‌లోనూ దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజాయన్ని చూసిన సఫారీ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.