కరోనా కారణంగా ఆ జట్ల మధ్య మ్యాచ్ వాయిదా...

కరోనా కారణంగా ఆ జట్ల మధ్య మ్యాచ్ వాయిదా...

క్రికెట్ కు కరోనా ఇచ్చిన బ్రేక్ అనంతరం మ్యాచ్ లు జోరుగా నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లలో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా సిరీస్ కూడా ఒకటి. అయితే ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ పూర్తయింది. అందులో ఇంగ్లాండ్ టీం క్లిన్ స్వీప్ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరగాలి. కానీ అది ఇప్పుడు వాయిదా పడింది. దానికి కారణం సఫారీ జట్టులోని ఓ ఆటగాడికి కరోనా సోకడమే... అయితే ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ కు ముందు నిబంధనల్లో భాగంగా రెండు జట్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి కరోనా సోకింది అని దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓ ప్రకటిచారు. ఆ కారణంగా ఈ మ్యాచ్ ను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపిన ఆయన కరోనా సోకినా వ్యక్తి మిగిత ఆటగాళ్లతో అంత సన్నిహితంగా లేడు అని ప్రకటించాడు. కానీ ఆ ఆటగాడు ఎవరో మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ రెండు జట్లకు ఈరోజు మరోసారి కరోనా పరీక్క్ష నిర్వహిస్తాము అని వాటి ఫలితాలు రేపు వస్తాయని దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓ తెలిపాడు.