ప్రపంచకప్ః టీమిండియా టార్గెట్ 228

ప్రపంచకప్ః టీమిండియా టార్గెట్ 228

ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్లు నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా(6; 9 బంతుల్లో, 1 ఫోరు), డీకాక్‌ (17 బంతుల్లో; 1 ఫోరు)లను బుమ్రా ఔట్‌ చేయగా,  వాన్‌ డెర్‌ డస్సెన్(22; 37 బంతుల్లో 1 ఫోరు), డుప్లెసిస్‌(38; 54 బంతుల్లో 4 ఫోర్లు), డేవిడ్ మిల్లర్(31; 40 బంతుల్లో 1 ఫోరు), ఫెలుక్వాయో(34; 61 బంతుల్లో, 2 ఫోర్లు) లను చహల్‌ పెవిలియన్ కు పంపాడు. జేపీ డుమినీ(3; 11 బంతుల్లో) కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. బాధ్యతాయుతంగా ఆడిన క్రిస్ మోరిస్(42; 34 బంతుల్లో 1 ఫోరు), ఇమ్రాన్ తాహీర్(0; 2 బంతుల్లో)లను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. 31 పరుగులు చేసిన రబాడా నాటౌట్ గా నిలిచాడు.