టీమిండియా బౌలింగ్ దాటికి దక్షిణాఫ్రికా విలవిల

టీమిండియా బౌలింగ్ దాటికి దక్షిణాఫ్రికా విలవిల

ప్రపంచ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభిస్తున్నారు. ప్రస్తుతం 41 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా(6; 9 బంతుల్లో, 1 ఫోరు), డీకాక్‌ (17 బంతుల్లో; 1 ఫోరు)లను బుమ్రా ఔట్‌ చేయగా,  వాన్‌ డెర్‌ డస్సెన్(22; 37 బంతుల్లో 1 ఫోరు), డుప్లెసిస్‌(38; 54 బంతుల్లో 4 ఫోర్లు), డేవిడ్ మిల్లర్(31; 40 బంతుల్లో 1 ఫోరు), ఫెలుక్వాయో(34; 61 బంతుల్లో, 2 ఫోర్లు) లను చహల్‌ పెవిలియన్ కు పంపాడు. జేపీ డుమినీ(3; 11 బంతుల్లో) కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో క్రిస్ మోరిస్(11; 10 బంతుల్లో ), రబాడా(3; 7 బంతుల్లో) ఉన్నారు.