ఓపెనర్లను పెవిలియన్ పంపిన బుమ్రా

ఓపెనర్లను పెవిలియన్ పంపిన బుమ్రా

టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు గట్టి దెబ్బతగిలింది. ఓపెనర్లు ఆమ్లా(6; 9 బంతుల్లో, 1 ఫోరు), డికాక్(17 బంతుల్లో; 1 ఫోరు)లు తక్కువ స్కోరులకే పెవిలియన్ చేరారు. టీమిండియా బౌలర్ బుమ్రా ఓపెనర్లను ఔట్ చేశారు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్ లో ఉన్న కెప్టెన్ డూప్లేసిస్( 33 ; 47 బంతుల్లో 4 ఫోర్లు), డుసెన్(15 ; 23బంతుల్లో 1 ఫోరు) ఆచితూచి ఆడుతున్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గాయంతో చివ‌రి మ్యాచ్‌కు దూర‌మైన ఆమ్లా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.