టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

ప్రపంచ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గాయంతో చివ‌రి మ్యాచ్‌కు దూర‌మైన ఆమ్లా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. మిగ‌తా ఏడు మ్యాచ్‌ల్లో క‌నీసం 6 మ్యాచ్‌ల్లో నెగ్గితేనే సెమీస్ చేరే అవ‌కాశం ఉంద‌ని డుప్లెసిస్ వివ‌రించాడు. రెండేళ్ల నుంచి చాలా క్రికెట్ ఆడామ‌ని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు టీమిండియా సార‌థి విరాట్ పేర్కొన్నాడు. సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, పేస‌ర్ మ‌హ్మద్ ష‌మీకి తుది జ‌ట్టులో చోటు ద‌క్కలేదు.

ఇరుజట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్ ల్లో గెలుపొందగా.. సౌతాఫ్రికా 46 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ప్రపంచ కప్ లో నాలుగుసార్లు ఎదురుపడగా భారత్ ఒక్కసారే (2015లో ) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. 

భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), లోకేశ్ రాహుల్, ధోనీ(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, బుమ్రా

సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, ఆమ్లా, డుప్లెసిస్(కెప్టెన్), వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, డుమిని, ఫెలుక్వాయో, క్రిస్‌మోరీస్, రబాడ, ఇమ్రాన్ తాహిర్, షంషీ