సౌత్ ఇండియన్ బ్యాంకుకు జరిమానా...

సౌత్ ఇండియన్ బ్యాంకుకు జరిమానా...

 రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా.. సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ స్థాయిలో జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లఘించింన కారణంగా జరిమానా వేసింది ఆర్‌బీఐ. వివరాల ప్రకారం... ఆస్తుల వర్గీకరణ, కెవైసీ మార్గదర్శకాలు, ట్రెజరీ విధులు మరియు తదితర అంశాల్లో ఆర్‌బీఐ నిబంధనలను సౌత్ ఇండియన్ బ్యాంకు ఉల్లఘించిందన్న ఆరోపణలపై.. 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్‌ఏసీ, కేవైసీ, ట్రెజరీలకు సంబంధించిన సూత్రాలను సౌత్ ఇండియన్ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో.. సెక్షన్ 47ఏ1సీ, సెక్షన్ 46ఏఐ కింద ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. గతంలో యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ లు ఆస్తుల అర్హతలు మరియు కెవైసి నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది.