జగన్ తో భేటీ అయిన దక్షణ కొరియా బృందం

జగన్ తో భేటీ అయిన  దక్షణ కొరియా బృందం


 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో దక్షిణ కొరియా బృందం సమావేశమైంది. దక్షిణ కొరియాలో భారత గౌరవ కాన్సులేట్‌ జనరల్‌ జంగ్ డీక్ మిన్ సీఎం జగన్ తో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్య, పరిశ్రమలు తదితర విషయాల గురించి సీఎం జగన్‌తో చర్చించారు. ఈ భేటీలో స్టీల్, ఆహార ఉత్పత్తులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా దక్షిణ కొరియా బృందానికి జగన్‌ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఎక్కడైనా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో కూడిన క్లస్టర్‌ ఏర్పాటు చేయాలంటూ సీఎం జగన్ దక్షిణ కొరియా బృందానికి ప్రతిపాదించారు. కాగా దక్షిణ కొరియా బృందం ఇప్పటికే మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజాను కలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్య, పరిశ్రమల రంగంలో పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిస్థితులను మంత్రులు దక్షిణ కొరియా బృందానికి వివరించారు.  ఈ భేటీకి జంగ్ డీక్ మిన్ నేతృత్వం వహించారు.