సౌత్ సినిమాలకే ఆ దమ్ముందా..?

సౌత్ సినిమాలకే ఆ దమ్ముందా..?

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయని అందరు అనుకునే వారు.  ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.  బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలు సమానంగా వసూళ్లు సాధిస్తున్నాయి.  ఇంకా చెప్పాలంటే..బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే ఎక్కువ వసూళ్లు సాధిస్తున్నాయి.  బాలీవుడ్ సినిమాలు సౌత్ లో రిలీజ్ చేస్తే ఎంత వసూలు సాధిస్తాయో తెలియదుగాని, మన సౌత్ మూవీస్ మాత్రం బాలీవుడ్ లో భారీగా వసూళ్లు సాదిస్తుండటం విశేషం.  

సౌత్ మూవీ బాహుబలి బాలీవుడ్ లో విడుదలయ్యి భారీ వసూళ్లు సాధించింది.  బాలీవుడ్ నిర్మాతల ఇంట కాసుల వర్షం కురిపించింది.  ఈ సినిమా తరువాత రజినీకాంత్ 2 పాయింట్ 0 కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధించింది.  ఇప్పుడు కన్నడ సినిమా కేజీఎఫ్ బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్నది.  మొదటి రోజు ఈ సినిమా బాలీవుడ్ లో రూ.2.10 కోట్లు వసూలు చేస్తే.. ఆరో రోజున కేజీఎఫ్ ఏకంగా రూ.2.90కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  

కేజీఎఫ్ ను మరో బాహుబలి అంటూ బాలీవుడ్ జనాలు పొడుగుతున్నారు.  యాష్ ఇంట్రో సీన్ కు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి.  కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది.  ఎన్నో అంచనాల మధ్య రిలీజైన జీరో సినిమాకు కేజీఎఫ్ అడ్డంకిగా మారడం విశేషం.