ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య పోటీ షురూ

ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య పోటీ షురూ

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  చాలా కాలం తరువాత రజినీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా మాస్ కు కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేశాడు మురుగదాస్.  సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.  రజినీకాంత్ సినిమా అంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.  

సంక్రాంతి సీజన్లో సందడి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సిద్ధం అవుతున్నారు.  మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ ఈరోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది.  టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ ను ప్రకటించారు.  సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు.  పక్కా ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్.  ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలు సంక్రాంతి బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాయి.  మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.