వరల్డ్‌కప్‌లో నేడు..

వరల్డ్‌కప్‌లో నేడు..

వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు టోర్నీలో హ్యాట్రిక్‌ ఓటములు నమోదు చేసిన దక్షణాఫ్రికా.. ఆఫ్గానిస్థాన్‌తో తలపడబోతోంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే దక్షణాఫ్రికా మిగిలిన ఐదు మ్యాచుల్లో విజయం సాధించాల్సిన పరిస్థితి. మరోవైపు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆఫ్గానిస్థాన్‌.. ఇవాలైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.