ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా భారీ స్కోరు

ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా భారీ స్కోరు

మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేశారు. కెప్టెన్ డుప్లెసిస్ (94 బంతుల్లో 100: 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్‌ సెంచరీ చేశాడు. డసెన్‌ (97 బంతుల్లో 95: 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ మిస్‌ అయ్యాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. 79 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన మారక్రమ్‌ను లియాన్‌ అవుట్‌ చేశాడు.114 పరుగుల వద్ద డికాక్(52) అవుటయ్యాడు. ఆ తర్వాత డుసెన్‌తో కలిసి కెప్టెన్ డుప్లెసిస్ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, లియోన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.