వరల్డ్‌కప్‌లో ఇవాళ..

వరల్డ్‌కప్‌లో ఇవాళ..

వరల్డ్‌కప్‌లో సూపర్‌ సండే మ్యాచ్‌ జరగనుంది. దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్‌ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీలు.. ఇవాళ గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు.. తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసి మెగా టోర్నీలో అదిరే ఆరంభం ఇవ్వాలని బంగ్లాదేశ్‌ ప్లాన్‌ చేసుకుంది.  
గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమవుతాడని భావించిన బంగ్లాదేశ్‌ మష్రాఫె మొర్తజా ఫిట్‌నెస్‌ సాధించడం ఆ జట్టుకు కొండంత బలం. తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన సఫారీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.