వరల్డ్‌కప్‌: పాకిస్థాన్‌ భారీ స్కోరు

వరల్డ్‌కప్‌: పాకిస్థాన్‌ భారీ స్కోరు

వరల్డ్‌ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బ్యాట్సమెన్‌ సత్తాచాటారు. బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది పాకిస్థాన్‌. టాస్ గెలిచి తొలి బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  308 పరుగులు చేసింది.  హారిస్‌ సోహైల్‌(89), బాబర్‌ అజామ్‌(69) హాఫ్‌ సెంచరీలు చేశారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, తాహీర్‌ 2 వికెట్లు పడగొట్టారు.