వరల్డ్‌కప్: చిక్కుల్లో సౌతాఫ్రికా
సౌతాఫ్రికా మళ్లీ తడబడుతోంది. వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. డికాక్-ఆమ్లా జోడీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. మూడో ఓవర్లోనే ఆమ్లా (6) అవుటయ్యాడు. కోట్రెల్ వేసిన బంతి అంచనా వేయలేకపోయిన ఆమ్లా.. నేరుగా గేల్ చేతికి క్యాచిచ్చాడు. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన మార్క్రమ్ కూడా కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మార్క్రమ్ను కూడా తన స్వింగ్‌తో కోట్రెల్ బోల్తా కొట్టించాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో కూడా కోట్రెల్ వికెట్లు తీసిన వెంటనే తన ట్రేడ్ మార్క్ 'మార్చ్ ఫాస్ట్'తో సెల్యూట్ చేశాడు. ప్రసుత్తం 7 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. డికాక్ 16(20), డుప్లెసిస్ 0(5) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)