వరల్డ్‌కప్‌: సౌతాఫ్రికాకు బ్యాడ్‌ టైమ్‌

వరల్డ్‌కప్‌: సౌతాఫ్రికాకు బ్యాడ్‌ టైమ్‌

ఈ వరల్డ్‌ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన దక్షిణాఫ్రికా.. విజయం సాధించకుండానే ఎట్టకేలకు ఖాతా తెరిచింది. వెస్టిండీస్‌తో ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ ఇచ్చారు. 8వ ఓవర్ జరుగుతుండగా వర్షం మొదలవడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత చాలా సేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. 

అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్‌ ఎంచుకుంది. డికాక్‌-ఆమ్లా జోడీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. మూడో ఓవర్లోనే ఆమ్లా (6) అవుటయ్యాడు. కోట్రెల్‌ వేసిన బంతి అంచనా వేయలేకపోయిన ఆమ్లా.. నేరుగా గేల్‌ చేతికి క్యాచిచ్చాడు. ఆ తర్వాత వన్‌ డౌన్‌లో వచ్చిన మార్క్‌రమ్ కూడా కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. మార్క్‌రమ్‌ను కూడా తన స్వింగ్‌తో కోట్రెల్‌ బోల్తా కొట్టించాడు. ఈక్రమంలో 8 ఓవర్‌లో చినుకులు మొదలవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. 

ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోవడంతో సౌతాఫ్రికా.. మిగిలిన ఐదు మ్యాచుల్లో తప్పక విజయం సాధిస్తేనే సెమీస్‌ అవకాశం ఉంటుంది.