హైదరాబాద్‌లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు

హైదరాబాద్‌లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు

హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై చర్చించారు.  దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల పరస్పర సహకారం పై డిస్కస్‌ చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హౌంశాఖకు చెందిన అధికారులు సైతం హాజరవుతున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) చీఫ్‌ సమన్వయంతో సాగే ఈ సదస్సులో దేశ అంతర్గత భద్రత మొదలుకొని ఆయా రాష్ట్రాల సరిహద్దుల సమస్యల వరకూ పలు అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. చర్చ తర్వాత హైద్రాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశం ఉంది.