బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ హౌజ్ అరెస్ట్ 

బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ హౌజ్ అరెస్ట్ 


ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ హౌజ్ అరెస్ట్ అయ్యారు. బోడుప్పల్ లోని పీర్జాది గూడ లొని నవయుగ అపార్ట్ మెంట్ లో ఆయనను నిర్బంధించారు. ఆర్మూర్ లో సన్మాన సభకు హజరుకావాల్సి ఉన్న సోయంను అదుపులోకి  తీసుకున్నారు పోలీసులు. తాజాగా మంత్రి అయిన సత్యవతి రాధోడ్‌, సోయంబాపూల మధ్య కొన్నిరోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపధ్యంలో లంబాడా సంఘాల నుంచి సోయంకు బెదిరింపులు కూడా వస్తున్నట్టు సమాచారం. ఈరోజు సోయంబాపూ రావుకు ఆర్మూర్‌లో ఆదివాసీ సంఘాలు చేసే సన్మానం చేయనున్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్నిఅడ్డు కుంటామని లంబాడా సంఘాల నుంచి పిలుపు వచ్చినట్టు చెబుతున్నారు.

ఈ నేపధ్యంలోనే ఆయనను సన్మాన కార్యక్రమానికి వెళ్లకుండా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  సోయంకు జరిగే సన్మాన కార్యక్రమంలో గొడవులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలోనే ఆయనను హౌస్‌ అరెస్ట్‌చేసినట్టు పోలీసులు తెలిపారు. బాపురావ్ ను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్బంధం చేయటాన్ని నిరసిస్తూ ఉట్నూర్ మండల కేంద్రం ఎన్టీఆర్ చౌక్ వద్ద ఆదివాసులు రాస్తారోకో చేశారు. బిజెపి నుండి ఎంపీగా గెలిచిన ఆదివాసీ ముద్దు బిడ్డ సోయంకు సన్మానం చేసే హక్కు కూడ లేకుండ తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.