ఎస్పీ బాలు నివాసం వద్ద పోలీసుల హడావిడి...

ఎస్పీ బాలు నివాసం వద్ద పోలీసుల హడావిడి...

గత నెల 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 40 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా మారడంతో ఆసుపత్రి వద్ద హై టెన్షన్ గా ఉంది. దాంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలిసులను మోహరించారు. ఇక ఎస్పీ బాలు నివాసం వద్ద వీధులన్నీ శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు కార్పొరేషన్ సిబ్బంది.  అలాగే ఎస్పీ బాలు నివాసం వద్ద పోలీసుల హడావిడి కొనసాగుతుంది. ఇక ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకి చేరుకున్నారు. అయితే అయితే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు.