ఎస్పీ బాలుకు మాతృవియోగం

ఎస్పీ బాలుకు మాతృవియోగం

సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ ఇవాళ కన్నుమూశారు. నెల్లూరు తిప్పరాజువారివీధిలోని నివాసంలో శకుంతలమ్మ తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. వయోభారంతో ఆమె కన్నుమూశారని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రస్తుతం బాలు లండన్‌లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన నెల్లూరు బయలుదేరారు.