నెల్లూరు చేరుకున్న ఎస్పీ బాలు

నెల్లూరు చేరుకున్న ఎస్పీ బాలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లండన్‌ నుండి ఈ రోజు నెల్లూరు చేరుకున్నారు. తిప్పరాజువారి వీధిలోని తన నివాసంలో తల్లి మృతదేహాన్ని చూసి బాలు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తల్లి శకుంతలమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ బాలు తల్లి శకుంతలమ్మ సోమవారం ఉదయం 7:10 గంటలకు తుదిశ్వాస విడిచారు.

సోమవారం ఎస్పీ బాలు సంగీత కచేరి నిమిత్తం లండన్‌లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న బాలు హుటాహుటిన స్వగ్రామానికి బయల్దేరి ఈ రోజు చేరుకున్నారు. మరోవైపు బాలు సోదరి శైలజ సోమవారమే నెల్లూరు చేరుకున్నారు. ఈ రోజు శకుంతలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.