అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం.. కాసేపట్లో హెల్త్ బులెటిన్ ?

అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం.. కాసేపట్లో హెల్త్ బులెటిన్  ?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి కాసేపట్లో హెల్త్ బులెటిన్   విడుదల చేయనుంది. ఆగస్టు 5న కరోనాతో ఆయన ఆస్పత్రిలో చేరారు. తర్వాత పరిస్థితి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స ప్రారంభించారు. ఈ చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు వార్తలొచ్చాయి. కరోనా నెగటివ్‌గా తేలింది. కానీ రెండురోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి మళ్లీ విషమించింది. బాలు ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో నిన్న రాత్రి నుంచి ఆస్పత్రి దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.