ఐసీయూలో ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం

ఐసీయూలో ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం

సినీ ఇండస్ట్రీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.  సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రి‌లో కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు.  అయితే.. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న హాస్పిటల్‌లో చేరగా.. నిన్న రాత్రి మరింత క్షిణించింది.  వైద్య నిపుణుల సూచన మేరకు ఆయనను ఐసీయూలో చేర్పించి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో సేవలు అందిస్తున్నారు. నిపుణుల బృందం బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు 
ఎంజిఎం ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.