ఆ చిన్న పొరపాట్లే బాలు ప్రాణం తీశాయా..?

ఆ చిన్న పొరపాట్లే బాలు ప్రాణం తీశాయా..?

కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, తగిన జాగ్రత్తలు తీసుకోండని... పాట ద్వారా.. మాట ద్వారా చెప్పిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అదే మహమ్మారి బారిన పడి తన ప్రాణాలు వదిలిపెట్టారు. మలయాళ సీమలో చివరి కాన్సర్ట్ చేసిన బాల సుబ్రహ్మణ్యం... చిన్న పొరపాట్ల వల్లే ఆయనకు కరోనా సోకిందని తెలుస్తోంది.  సంగీత విభావరి సమయంలో మాస్క్‌ను తీసేయడం.. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం.. అదే సమయంలో ముక్కును ముట్టుకోవడం వల్లే బాలుకు కరోనా సోకందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిన్న పొరపాట్లే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందంటున్నారు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలు ఇక లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది.