ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ అప్డేట్..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ అప్డేట్..!

ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ తరవాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. దాంతో ఆయన కరొనాను జయించి క్రమంగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్నారు. తాజాగా తండ్రి ఆరోగ్యంపై చరణ్ ఓ వీడియోను విడుదల చేసారు. శుక్రవారం  నుంచి బాలు ఆహారం తీసుకుంటున్నారని, రోజులో 15-20 నిమిషాలు డాక్టర్ల సాయంతో లేచి కూర్చుంటున్నారని తెలిపాడు. ఇప్పటికీ ఆయనకు ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫెక్క్షన్ లు లేవని...ఉపిరితిత్తులు మరింత మెరుగుపడాలని డాక్టర్లు తెలిపారని పేర్కొన్నాడు. అంతేకాకుండా మెరుగైన వైద్యం అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.