మోడీ ఓటమి ఖాయం.. అఖిలేష్‌

మోడీ ఓటమి ఖాయం.. అఖిలేష్‌

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2019లో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో ఆయన ఇవాళ మాట్లాడారు. యూపీలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలం ఏమాత్రం లేదని ఆయన అన్నారు. మోడీ భయంతో తాము జత కట్టలేదని సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీల పొత్తుపై అన్నారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి కచ్చితంగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రధాని కావాలని అనుకోవడం లేదని, అయితే కచ్చితంగా ప్రధాని ఎంపికలో ప్రధాన పాత్ర పోషించాలని ఉందని అన్నారు.  యోగి పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని, తాను సీఎంగా ఉన్న సమయంలో గ్రామీణాభివృద్ధి అద్భుతంగా సాగిందని అన్నారు.