వైఎస్ వివేకా మృతిపై లోతుగా దర్యాప్తు

వైఎస్ వివేకా మృతిపై లోతుగా దర్యాప్తు

వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై దర్యాప్తు వేగవంతమైంది. అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేశ్ శర్మ తెలిపారు. మృతిపై అనుమానాలున్నాయని వైఎస్ వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఐపీసీ 175 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసును అన్ని కోణాలలో విచారిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని ఆయన తెలిపారు.  ఇప్పటికే ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. కేసును సీరియస్ గా తీసుకున్నామని, విచారణలో ఎవరి పాత్ర అయినా ఉన్నట్లు తేలితే వారిపై చట్ట రీత్యా  కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పష్టం చేశారు.