అమ్మో కేటుగాళ్ళు : ఏకంగా నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్ హ్యాక్ !

అమ్మో కేటుగాళ్ళు : ఏకంగా నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్ హ్యాక్ !

ఏకంగా నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్ హ్యాక్ చేశారు కేటుగాళ్ళు. రంగనాథ్ ఆవుల వెంకట పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా ఎస్పీ అనుకుని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. దీంతో ఎస్పీ పేరుతో డబ్బుల వసూళ్ళకి తెగ్గపడ్డారు కేటుగాళ్ళు. తన భార్య అకౌంట్ కి 20,000 వేయాలంటూ ఒకరికి మెసేజ్ లు చేశారు. ఒరిస్సాకి చెందిన మహిళ అనిత పేరుతో గూగుల్ పే ఫోన్ పే నెంబర్ పంపుతున్న కేటుగాళ్ళు డబ్బుల పంపిన వెంటనే స్క్రీన్ షాట్ కొటి పంపాలంటూ పలువురుతో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. విషయం తెలిసి షాక్ తిన్న ఎస్పీ రంగనాథ్, ప్రస్తుతం ఈ రిక్వెస్ట్ వస్తున్న అకౌంట్ 2 సంవత్సరాల క్రితం వాడడం మానేశానని అంటున్నారు ఎస్పీ. ఇది తన అకౌంట్ కాదంటూ క్లారిటీ ఇచ్చిన ఎస్పీ రంగనాథ్ ఎవరు డబ్బులు పంపొద్దని కోరారు. ఈ అకౌంట్ హ్యాకింగ్ మీద సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయనున్నారు ఎస్పీ.